6 July, 2026 | 3:12 PM

Breaking News

విజయ క్రాంతి వార్తకు స్పందన రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

గ్రామ నాయకత్వం నుంచి విద్యా నాయకత్వం వైపు..

14-05-2026 12:52 AM

చొప్పదండి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సర్పంచుల ఐక్య సంకల్పం

చొప్పదండి, మే13 (విజయక్రాంతి): ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సర్పంచుల కోసం ప్రత్యేక వరాప్ను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వైద్యాధికారి డా. అశ్విని తనాజీ వాఖడే  మాట్లాడుతూ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పాఠశాలల్లో అల్పాహార పథకం, విద్యార్థులకు 24 అంశాల కిట్ పంపిణీ, డిజిటల్ లెర్నింగ్, ప్రిపరేటరీ స్కూల్స్ వంటి ప్రభుత్వ విద్యా కార్యక్రమాలపై సర్పంచులు, ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించారు.

గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సర్పంచులు చురుకైన పాత్ర పోషించాలని ఆమె కోరారు.తాను ప్రభుత్వ పాఠశాలలోనే చదివి అనంతరం ఐఏఎస్ అధికారిగా ఎదిగానని తెలియజేస్తూ, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె ప్రేరణాత్మకంగా పిలుపునిచ్చారు.మున్సిపల్ చైర్మన్‌వడ్లూరి సరిత మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ల్యాబ్లు, డిజిటల్ విద్యా సదుపాయాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి మున్సిపాలిటీ కట్టుబడి ఉందని తెలిపారు.

వి. నర్సింగా రావు జ్యోతి, ప్లానింగ్ కోఆర్డినేటర్ మిలుకూరి శ్రీనివాస్ రంగనాథ శర్మ కరీంనగర్ జిల్లా విద్యా నివేదికను సమర్పించగా, గంగాధర ఎంఈఓ బడిబాట కార్యక్రమ విజయాలు మరియు కొనసాగుతున్న విద్యా కార్యక్రమాలను వివరించారు.ఎంఈఓ ఏనుగు ప్రభాకర్ రావు ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలు, బోధనా వాతావరణం, డిజిటల్ తరగతి గదులు మరియు నాణ్యమైన బోధన విధానాలను చూపిస్తూ ప్రేరణాత్మక వీడియో ప్రదర్శన నిర్వహించారు.