calender_icon.png 11 July, 2025 | 11:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరస్వతీ పుత్రికకు ఆర్థిక సాయం

11-07-2025 07:26:31 PM

సూర్యాపేట,(విజయక్రాంతి): జిల్లా కేంద్రము లోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో గుమస్తాగా పనిచేసిన జనార్ధన చారి ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో వారి కుమార్తె కన్నోజు సిరి చందన ప్రతిభా జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతుంది. చదువుకు భారం కావడంతో జిల్లా ఆర్యవైశ్య మహాసభ కోశాధికారి  చల్లా లక్ష్మీకాంత్ ను సంప్రదించడముతో శుక్రవారం ఆయన కార్యాలయంలో  రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా చల్లా లక్ష్మీకాంత్ మాట్లాడుతూ... ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడంలోనే ఆత్మసంతృప్తి కలుగుతుందని తెలుపుతూ, ఉన్నత చదువు లు చదివి వృద్ధి లోకి వచ్చిన తరువాత, తమ బాధ్యత గా కష్టం లో ఉన్న పేద వారికీ తమ వంతు సాయం చేయాలని కోరారు.