calender_icon.png 11 July, 2025 | 11:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పశువులను రోడ్లపై వదిలితే కఠిన చర్యలు

11-07-2025 07:39:46 PM

ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్

ఖానాపూర్,(విజయక్రాంతి): పశువులను యజమానులు రోడ్లపై నిర్లక్ష్యంగా వదిలిపెడితే కఠిన చర్యలు తీసుకుంటామని నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ కమిషనర్ సుందర్ సింగ్ హెచ్చరించారు. గత కొంతకాలంగా ఖానాపూర్ పట్టణ ప్రధాన రహదారిపై పశువులను నిర్లక్ష్యంగా యజమానులు విడిచిపెట్టడంతో ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు.

ఈ నేపథ్యంలో ఎన్నిసార్లు యజమానులను హెచ్చరించిన వారు బేఖాతరు చేస్తున్నారని దీనిని సహించేది లేదని హెచ్చరించారు. ప్రస్తుతం పశువుల యజమానులకు 1000 ఫైన్ వేస్తున్నామని పశువులను గోశాలకు తరలించి యజమానులపై తగు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కమిషనర్ హెచ్చరించారు. శుక్రవారం రోడ్లపై ఉన్న పశువులను మున్సిపల్ సిబ్బంది గోశాలకు తరలించారు. సూపర్వైజర్ మానాల శంకర్ ఆధ్వర్యంలో సిబ్బంది పశువులను తరలించారు.