calender_icon.png 11 July, 2025 | 11:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్వకుంట్ల గ్రామం నుంచి ఇంటిగ్రేటెడ్ పాఠశాలను తరలించవద్దు

11-07-2025 07:23:49 PM

కట్ట లింగస్వామి-డివైఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి

మునుగోడు,(విజయక్రాంతి): గత సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను కల్వకుంట్ల గ్రామం నుంచి వేరే ప్రాంతానికి తరలించవద్దని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కట్ట లింగస్వామి శుక్రవారం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో చండూరు ఆర్డీవో వి.శ్రీదేవికి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. గతంలో కల్వకుంట్ల గ్రామ శివారులో శంకుస్థాపన చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఇప్పుడు మళ్లీ వేరే ప్రాంతానికి మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.

ఆరోజున అంగు ఆర్భాటాల తోటి రాత్రికి రాత్రే రైతుల పంటలను మొత్తం చెడగొట్టి పంటకు తగినటువంటి నష్ట పరిహారం కూడా ఇవ్వకుండా భూములు గుంజుకున్నటువంటి విధానాన్ని ఆ రోజున అందరం చూడడం జరిగిందని గుర్తు చేశారు. అంత ఆర్భాటంగా చేసి రైతులను సైతము ఇబ్బంది పెట్టినప్పుడు అది మారుమూల గ్రామము అనే విషయము ఆనాడు మీకు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.

ఎక్కడ కూడా తగిన భూమి లేకపోవడంతోటి కల్వకుంట్ల గ్రామంలో అణువుగా ఉందని చెప్పి, అక్కడ ఉన్నవారు మొత్తం కూడా దళిత రైతులే కదా అని భావించి వారిని బెదిరిస్తే బెదిరిపోతారని గ్రహించి ఆ రైతుల దగ్గర భూమి లాక్కోవడ, పంట నష్టం చేయడం జరిగింది అని అన్నారు. ప్రజలు కూడా మా భూములు పోయిన పర్వాలేదు గ్రామం అభివృద్ధి చెందడానికి అవకాశం వచ్చిందని భావించి అందరు ఇంటిగ్రేటెడ్ స్కూలు ప్రారంభానికి మద్దతు తెలిపారని అన్నారు.

కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తమ స్వార్థాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు తప్ప వీరి నిర్ణయాల వల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని కల్వకుంట్ల గ్రామంలో పాఠశాలలను నిర్మించడం వలన జరిగే నష్టం ఏమిటో కూడా ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. కల్వకుంట్ల గ్రామం చండూరు గట్టుపల్ మండలాలకు  సౌకర్యంగా ఆనుకొని ఉంటుందని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే భవిష్యత్తులో మూడు మండలాల ప్రజలు అభివృద్ధి అవుతారని  అన్నారు. కల్వకుంట్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎ ముఖం పెట్టుకొని రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో ఓట్లు అడుగుతారో మేము కూడా యువజన సంఘంగా చూస్తామని ఎక్కడకక్కడ వారు చేసిన మోసాన్ని ప్రజలకు వివరిస్తామని అన్నారు.