calender_icon.png 11 July, 2025 | 11:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ డ్యూటీ మీట్‌లో జిల్లాకు 11 పథకాలు

11-07-2025 07:19:38 PM

వృత్తి నైపుణ్యకి పోలీస్ డ్యూటీ మీట్ ఆవశ్యకం

పథకాలు సాధించిన సిబ్బందిని అభినందించిన ఎస్పి రాజేష్ చంద్ర

కామారెడ్డి,(విజయక్రాంతి): కరీంనగర్ లో ఈ నెల 7, 8 వ తేదీలలో నిర్వహించిన 2 వ జోనల్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ లో జిల్లా తరుపున పాల్గొని 11  పతకాలు సాధించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు. 2 వ జోనల్ పోలీస్ డ్యూటీ మీట్ – 2025 లో పతకాలు సాధించిన జిల్లా అధికారులు, సిబ్బంది వివరాలు ఇలా ఉన్నాయి. బి. ఆంజనేయులు గాంధారి  మొత్తం 5 పతకాలు (3 బంగారు, 2 వెండి ) విచారణలో శాస్త్రీయ వినియోగం మూడు బంగారు పతకాలు, (1.లిఫ్టింగ్, ప్యాకింగ్ – ఫింగర్ ప్రింట్స్ ఫార్వర్డ్ 2.నేర స్థల ఫోటోగ్రఫీ).

ఈ విభాగంలో ఓవర్ ఆల్ ఛాంపిన్‌షిప్, వెండి పతకాలు- 2  విచారణలో శాస్త్రీయ వినియోగం (ఫింగర్ ప్రింట్ మరియు ఫోరెన్సిక్ సైన్స్), కె. విజయ్ మద్నూర్ –2 వెండి పతకాలు 1. ఫోరెన్సిక్, ఫోటోగ్రఫీ 2. ఫింగర్ ప్రింట్ సైన్స్, ఎస్.లక్ష్మీనారాయణ్, బిచ్కుంద- కాంస్య పతకం 1. దర్యాప్తు (రాత పరీక్ష), పోలీస్ పోర్ట్రెట్, ఎ. చిరంజీవి రాజంపేట- కాంస్య పతకం 1 కంప్యూటర్ అవగాహన, పి. రామచంద్రం ఏఆర్- వెండి పతకం 1 విధ్వంసకాల విచ్చిన్నం కై తనిఖీ, పి. యెల్లారెడ్డి ఏఆర్ - వెండి పతకం- 1 విధ్వంసకాల విచ్చిన్నంకై తనిఖీ విభాగాల్లో పథకాలు సాధించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది తమ వృత్తి నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరచుకొని మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని వృత్తి నైపుణ్యo ఉన్న వారిని గుర్తించడానికి పోలీస్ డ్యూటీ మీట్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. కరీంనగర్‌లో జరిగిన 2వ జోనల్ పోలీస్ డ్యూటీ మీట్‌లో జిల్లా తరుపున పాల్గొని 11 పతకాలు సాధించడం పట్ల జిల్లా పోలీస్ వృత్తి పట్ల నైపుణ్యాన్ని తెలియజేస్తుంది అని అన్నారు. జోనల్ స్థాయిలో పతకాలు సాధించిన వారికి రాష్ట్ర స్థాయిలో, తర్వాత జాతీయ స్థాయిలో పోలీస్ డ్యూటీ మీట్ ఉంటుందని అందులో కూడా మంచి ప్రతిభ కనబరిచి జిల్లా కు మెడల్స్ అందించాలని జిల్లా ఎస్పీ వారిని అభినందిచడం జరిగింది.