11-07-2025 07:15:00 PM
ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్
బైంసా,(విజయక్రాంతి): ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు శుక్రవారం వనమహోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం భైంసా గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ముధోల్ ఎమ్మెల్యే రామారావ్ పటేల్, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) ఫైజాన్ అహ్మద్, డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ... ప్రకృతి సమతుల్యతను కాపాడాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలన్నారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు వనరక్షణ అత్యంత అవసరమని, ఈ తరానికే కాకుండా భవిష్యత్ తరాలకూ హరితవాతావరణం అందించాలంటే ప్రతి ఒక్కరు మొక్కల సంరక్షణకు కృషి చేయాలనీ కోరారు.
అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మాట్లాడుతూ... పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వమే కాదు, ప్రజలందరి బాధ్యతని, మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పేర్కొన్నారు. విద్యార్ధి దశ నుండే పర్యావరణంపై అవగాహన పెంపొందించాలని, మొక్కల ప్రాముఖ్యతను తెలియజేస్తూ పచ్చదనం, పర్యావరణం పై బాధ్యతను అలవర్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు.