calender_icon.png 11 July, 2025 | 10:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాలి

11-07-2025 07:35:16 PM

కట్ట లింగస్వామి-డివైఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి

చండూరు,(విజయక్రాంతి): మండలంలో అన్ని గ్రామాలలో ప్రత్యేక అధికారుల పాలనలో పారిశుధ్యం పేరుకుపోయిందని, వర్షాకాలంలో నీటి నిల్వలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డివైఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంపీడీవో యాదగిరి గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి మాట్లాడుతూ... అధికారుల పాలనలో గ్రామాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయని పారిశుద్ధ్యం కొంటుపడిపోతుందని,కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలేని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారని, గ్రామాల్లో నిత్యం ప్రజలు అవసరాన్నికి వాడుకునే బోర్ వాటర్ మోటర్లు కాలిపోతే వాటిని బాగు చేసే దిక్కు లేకుండా పోయిందని మండిపడ్డారు.

వర్షాకాలంలో ప్రతి గ్రామంలో కుంటలు మరియు మురికి గుంటలలో నీరు నిల్వ ఉండడం వలన లార్వా పెరిగి ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని అంతేకాకుండా ఇంటి ముందర వర్షం నీటిని డబ్బాలలో మరియు కుండలలో ఎక్కువ రోజులు నిల్వ చేయకుండా అధికారులు ప్రజలకు తగిన సూచనలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ నాయకులు వారి వ్యక్తిగత ప్రచారం కోసం సమీక్షల పేరుతోటి  కాలయాపన చేయడం, మీడియాలో ప్రచారం  చేసుకోవడం మాత్రమే తప్ప ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని ఎద్దేవా చేశారు.

సమీక్షల మీద సమీక్షలు జరుగుతున్నాయి తప్ప గ్రామాల్లో సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని మండిపడ్డారు. గ్రామాలలో దోమలు మరియు లార్వాపెరగకుండా నిత్యం మందులను పిచికారి చేసే విధంగా అధికారులు చర్యలు ఎక్కడ కనబడడం లేదని అన్నారు. ఇప్పటికైనా గ్రామస్థాయిలో పర్యవేక్షణలు చేసి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా అధికారులు మరియు నాయకులు చర్యలు తీసుకోవాలని కోరారు.