నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి
సిద్దిపేట,(విజయకాంతి): వన మహోత్సవంలో భాగంగా సిద్దిపేట పట్టణంలోని ఆదర్శనగర్ లో కమిషనర్ ప్రేరణ మొక్కలను నాటి వాటికి నీరు పోయటం జరిగింది. వన మహోత్సవంలో భాగంగా పట్టణంలో నాటుతున్న మొక్కలను, చెట్లకు పాదులు తీయడం, నీరు పట్టడం వంటి పనులను పరిశీలించారు. పెట్టిన ప్రతి మొక్క పెరిగేలా సంరక్షించాలని సిబ్బందిని ఆదేశించారు. పట్టణమంతా పచ్చదనంతో విలసిల్లుతోందనీ పట్టణ ప్రజలు సైతం మొక్కలను, చెట్లను సంరక్షిస్తున్నారని ప్రతిరోజు మన పరిసరాలలో ఉండే మొక్కలకు నీరు పోసి సంరక్షించాలన్నారు.
ఫ్రై డే డ్రై డే కార్యక్రమంలో భాగంగా 9వవార్డులో పర్యటించి ఇళ్లల్లో, ఆరుబయట నీటి నిల్వ వలన దోమలు వృద్ధి చెంది మలేరియా, డెంగ్యూ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వ్యాపిస్తాయని సూచించారు. మురికి కాలువలో ఆయిల్ బాల్స్ ని వేయడం, మలాథిన్ పిచికారి చేస్తామని చెప్పారు . రోజు ఇంట్లో వెలువడే చెత్తను తడి, పొడి, హానికర చెత్తగా వేరు చేసి మున్సిపల్ చెత్త వాహనానికి అందించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో వాటి కౌన్సిలర్ సతీష్, ఏ ఈ యాదగిరి, సానిటరీ ఇన్స్పెక్టర్ వనిత, రమ్య తదితరులు పాల్గొన్నారు.






