calender_icon.png 1 November, 2025 | 7:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

8 మంది ఐఏఎస్‌ల బదిలీ

01-11-2025 12:00:00 AM

  1. రవాణా శాఖ కమిషనర్‌గా ఇలంబర్తి
  2. సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ

హైదరాబాద్, అక్టోబర్ 31 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్లాగ్‌షిప్ అభివృద్ధి, సంక్షేమ పనుల విభాగం ప్రత్యేక సీఎస్‌గా సవ్యసాచి ఘోష్ నియమితులయ్యారు. అలాగే సంక్షేమ శాఖ ప్రత్యేక సీఎస్‌గాను కొనసాగనున్నారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్‌గా అని తా రామచంద్రన్‌కు ప్రభుత్వం అదనపు బాధ్యతలను అప్పగించింది.

రవాణా శాఖ కమిషనర్‌గా ఇలంబర్తిని నియమించిన ప్రభు త్వం పశుసంవర్ధక శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పజె ప్పింది. మెట్రో పాలిటన్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్యదర్శి బాధ్యతలు సీఎస్ వద్దే ఉండగా, జీఏడీ కార్యదర్శిగా ఇ శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు, ఆయిల్‌ఫెడ్ ఎండీగా యాస్మిన్ బాషాకు అదనపు బాధ్యతలు, ఎస్సీ అభివృద్ధి కమిషనర్‌గా జి జితేందర్ రెడ్డిని నియమించింది. అలాగే ఎస్సీ సహకార సంస్థ ఎండీగా అదనపు బాధ్యతలు ఇచ్చింది. అభివృద్ధి సంక్షేమ పనుల అమలు విభాగం ప్రత్యేక కార్యదర్శిగా సైదులుకు అదనపు బాధ్య తలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.