calender_icon.png 27 July, 2025 | 9:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మౌలిక వసతుల కల్పనకు సంపూర్ణ సహకారం

26-07-2025 12:00:00 AM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి 

పటాన్ చెరు, జులై  25 : పటాన్ చెరు డివిజన్ పరిధిలోని పారిశ్రామికవాడలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే గూడెం  మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్ చెరు ఐలా ప్రతినిధులు ఇటీవల తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మె ల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం వివిధ శాఖల అధికారులు, ఐలా  ప్రతినిధులతో కలిసి పట్టణ పరిధిలోని ఐలా పారిశ్రామికవాడలో పర్యటించారు.

ప్రధానంగా పరిశ్రమలకు తాగునీటి సౌకర్యం లేకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రని తెలిపారు.  నూతన విద్యుత్ లైన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. వీటితో పాటు పారిశ్రామిక వాడలో నూతన రహదారుల ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు. 

ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే  పారిశ్రామికవాడలో నూతన విద్యుత్ లైన్లతో పాటు నిరంతరాయ విద్యుత్ సరఫరాకు అనుగుణంగా లైన్లు ఏర్పాటు చేయాలని ట్రాన్స్కో డిఈ భాస్కర్ రావు ను ఆదేశించారు. అలాగే ప్రతి పరిశ్రమకు మంచినీటి కనెక్షన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, ఐలా చైర్మన్ సుధీర్ రెడ్డి, విద్యుత్ శాఖ డీఈ భాస్కర రావు, ఐలా ప్రతినిధులు రంజిత్, సురేందర్,  తదితరులు పాల్గొన్నారు. 

నిరుపేదలకు అండగా సీఎంఆర్‌ఎఫ్ 

నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిది అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు మండలం భానూరు గ్రామానికి చెందిన సురేష్ చికిత్స నిమిత్తం రెండు లక్షల రూపాయల ఎల్‌ఓసి మంజూరు అయింది.

ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సురేష్ కుటుంబ సభ్యులకు ఎల్‌ఓసి అనుమతి పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, పాండు, కాశి రెడ్డి, తదితరులుపాల్గొన్నారు.