calender_icon.png 26 July, 2025 | 1:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమ్యూనిటీ హాల్ లకు నిధుల మంజూరు

25-07-2025 10:47:18 PM

బిజెపి నాయకుల హర్షం

చిన్నచింతకుంట: మండల కేంద్రంలోని వాల్మీకి, ముదిరాజు కుల సంఘాలకు కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు నిధులు మంజూరు చేయడం జరిగిందని శుక్రవారం బిజెపి నాయకులు నంబిరాజు, కుర్వ రమేష్ దశరథ్ లు  హర్షం వ్యక్తం చేశారు. బిజెపి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ..దేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ  నేతృత్వంలో అభివృద్ధిలో భాగంగా గ్రామాలు కూడా అభివృద్ధి కావాలని ఉపాధి హామీ కింద రోడ్ల, డ్రైనేజీ నిర్మాణాలకు ఊహించని నిధులు కేటాయిస్తున్నారు. దానిలో భాగంగా మోడీ నేతృత్వం లోని ఎంపీ డీకే అరుణమ్మ మండల బీజేపీ శాఖ అడిగిన వెంటనే రెండు కమ్యూనిటీ హాల్స్ మంజూరు చేయడం జరిగింది. ముదిరాజ్,వాల్మీకి కమ్యూనిటీకి ఒక్కొక్కటీ 9 లక్షల విలువ గల నిధులు మొత్తం 18 లక్షలు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు .ఎంపీ అరుణమ్మ కు బీజేపీ మండల శాఖ కృతజ్ఞతలు తెలిపారు. మండలం లో మోడీ  ప్రభుత్వం ఉపాధి హామీ నిధులనుంచి రోడ్లకు,డ్రైనేజీలు కు రూ.20 కోట్లతో అభివృద్ధి జరిగిందన్నారు.భవిష్యత్తు లో ఇంకా అభివృద్ధి దృష్టి లో ఉంచుకొని కేంద్రం, ఎంపీ ల ద్వారా  నిధులు తెస్తామని బిజెపి నాయకులు తెలిపారు.