25-07-2025 10:43:59 PM
మణుగూరు,(విజయక్రాంతి): కార్మిక సమస్యలపై ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీ ప్రతినిధులతో సింగరేణి ఉన్నతాధికారులు ఏరియా జియం కార్యాలయ కాన్ఫిరేన్సహాల్ లో శుక్రవారం 4వ స్ట్రక్చర్ సమావేశం నిర్వహించారు. చర్చకు వచ్చిన అంశాల పురోగతి పై సమీక్షా జరిపారు. ఏరియా కార్మికుల సంక్షేమంకోసం ఈసందర్భంగా 10 అంశాలతో ఐఎన్‌టియూసి వైస్ ప్రెసిడెంట్ కృష్ణంరాజు చేసిన ప్రతిపాదనలను జిఎం దుర్గం రామచందర్ సానుకూలం వ్యక్తంచేశారు. ప్రాతినిధ్య సంఘం ప్రతినిధులు మాట్లాడు తూ... తమ సంఘం సంస్థ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం కోసం యాజమాన్యంకు సహకరిస్తుందన్నారు.