25-07-2025 10:51:16 PM
రాజాపూర్: గ్రామాల్లో తాగునీటి సమస్యను తలెత్తనియం అని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు జనం పల్లి శశికళ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని తిర్మలపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని నర్సంపల్లితండాలో ఎమ్మెల్యే తన సొంత నిధులతో వేస్తున్న బోరు డ్రిల్లింగ్ పనులకు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారం కోసం శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. మండలం లోని ఏ గ్రామంలో కూడా ప్రజలకు నీటి సమస్య లేకుండా చూస్తామని తెలిపారు.