01-05-2025 12:52:49 AM
హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాం తి): ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా 2.20 లక్షల ఎకరాలకు సాగునీరు, 516 గ్రా మాల కు తాగునీరు లక్ష్యంతో ఎస్‌ఎల్‌బీసీ కాంక్రీ ట్ లైనింగ్ పనులకు రూ.442 కోట్ల నిధులు కేటాయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిధులతో 112.65 కిలోమీటర్ల మేర కాలువ నిర్మాణ పనులు పుంజుకోనున్నాయి. మంత్రి కోమటిరెడ్డి స్పందిస్తూ.. నల్లగొండ జిల్లావాసుల నాలుగు దశాబ్దాల కలను నెరవేరుస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.