01-05-2025 12:51:53 AM
ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి
అబ్దుల్లాపూర్ మెట్, ఏప్రిల్ 30: బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి అన్నారు. బుధవారం తహసీల్దార్ సుదర్శన్ రెడ్డితో కలసి రావి నారాయణరెడ్డి కాలనీ ఫేస్ 3 లో ఇటీవల అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి.. బాధితులను పరామర్శించారు. ఈ ప్రమాదంలో తాము సర్వం కోల్పోయామని.. తమ సర్టిఫికెట్స్ కూడా కా లి బూడిద అయినట్లు బాధితులు ఆర్డీవో దృష్టికి తీసుకెళారు.
అనంతరం ఆర్డీవో అనంతరెడ్డి మాట్లాడుతూ... బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ అగ్ని ప్రమాదంలో 200 గుడిసెలు కాలిపోయాయని.. ప్రమాద వివరాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని బాధితులకు తగు న్యాయం చేస్తామని ఆర్డీవో అనంతరెడ్డి తెలిపారు.
కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీంద్ర చారి, నాయకులు ముత్యాల యాదిరెడ్డి, అజ్మీర హరి సింగ్ నాయక్, దాసరి ప్రసాద్, పొన్నాల యాదగిరి, గణేష్, సైదులు, నవనీత, అరుణ, సుజాత, వినోద్ నాయక్, వీరేష్, తదితరులు పాల్గొన్నారు.