calender_icon.png 12 August, 2025 | 12:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకులాల సరుకుల టెండర్లు పాత విధానంలోనే కొనసాగాలి

11-08-2025 08:39:46 PM

ప్రజావాణిలో పిర్యాదు చేసిన టెండర్ దారులు

వనపర్తి టౌన్: 2025-26 విద్య సంవత్సరానికి కూరగాయలు, కోడిగుడ్లు మటన్ ప్రొవిజన్స్ సరఫరాలో ప్రభుత్వం కొత్త విధానం అనుసరిస్తుండడంతో సోమవారం టెండర్ దారులు ప్రజావాణిలో కలెక్టర్ పిర్యాదు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా గురుకులలో కష్ట నష్టాలకు ఓర్చుకొని అన్ని రకాల సరుకులు అందజేశామని చెప్పారు. ఇప్పటికి ఇంకా నాలుగు నెలల నుండి మాకు ఎటువంటి బిల్లులు ప్రభుత్వం చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త టెండర్లో సరికొత్త నియామలు పెట్టి మమ్మల్ని తప్పించాలని ప్రభుత్వం చూస్తుందని మండిపడ్డారు. కొత్త టెండర్ విధానం మార్చుట, టెండర్లో అధిక ఈ యం డి మార్చుట, పాట టెండర్ విధానం కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

సాయంత్రం 4 గంటల నుండి కాకుండా 6 గంటల వరకు కాకుండా యధావిధిగా గత సంవత్సరం విధంగా సరుకులు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్త టెండర్లో కోడిగుడ్లు టెండర్ మార్చి పాట టెండర్ విధానం కొనసాగించాలని కోరారు. పాత టెండర్ విధానాన్ని అనుసరించే వరకు నేటి నుండి అన్ని గురుకులాలలో కూరగాయలు, పండ్లు, కోడిగుడ్లు, చికెన్, మటన్, ప్రొవిజన్స్, క్యాటరింగ్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టెండర్ దారులు రామాంజనేయులు, చందు తదితరులు పాల్గొన్నారు.