11-08-2025 09:37:04 PM
శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం..
మునుగోడు (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లుని అన్ని రాజకీయ పార్టీలు సమర్ధించినవి ముస్లిం పేరుతో బీజేపీ ఈ బిల్లును అడ్డుకోవడం బీసీలకు తీవ్రమైన ద్రోహం చేస్తుందని శాసన మండల సభ్యులు నెల్లికంటి సత్యం(Legislative Assembly Member Nellikanti Satyam) అన్నారు. సోమవారం మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు సీఎం సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేసి మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లలకు ఎలాంటి షరతులు లేకుండా బిల్లులు ఇవ్వాలని అన్నారు. గ్రామాలలో ఇంకా లబ్ధిదారులు ఇంకా లబ్ధిదారులు ఉన్నారని వారికి కూడా ఇండ్ల మంజూరు ఇవ్వాలని ఇసుక అందుబాటులో ఉండే విధంగా చూడాలని అధికారులను కోరారు.
అనేక రాష్ట్రాలలో బిజెపి ముస్లింల కు రిజర్వేషన్ లు ఇస్తున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో బీసీ పేరుతో అడ్డుకోవడం సరైనది కాదు. తరతరాలుగా రాజకీయంగా విద్యాపరంగా ఉద్యోగ పరంగా బీసీలు నష్టపోతారు. అత్యధిక జనాభా గల బిసిలు ఉన్న రాష్ట్రం. ఈ రాష్ట్రంలో బండి సంజయ్ కిషన్ రెడ్డి లు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు బీజేపీ పార్టీ ఈ 42 శాతం బీసీ రిజర్వేషన్లను ఎత్తివేయాలని పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నారు. ఇలాగనే బిజెపి అవలంబిస్తే బీసీలు ఎస్సీలు ఎస్టీలు గ్రామాలలో అడ్డుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి చాపల శ్రీను,ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి టి.వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి గురజా రామచంద్రం,బండారు శంకర్ ,భీమనపల్లి రమేష్ ,లాలు దయాకర్ పాండు ఉన్నారు.