calender_icon.png 10 August, 2025 | 10:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భార్య వేధింపులు భరించలేక భర్త ఆత్మహత్య

24-07-2025 11:25:38 PM

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): భార్య వేధింపులకు తట్టుకోలేక భర్త తాగుడుకు బానిసై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్గొండ మండలం కంచనపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై సైదా బాబు(SI Saidababu) తెలిపిన వివరాల ప్రకారం.. కంచనపల్లి గ్రామానికి చెందిన గంగదారి నరేష్(39)కి నాంపల్లి మండలం గట్ల మల్లేపల్లికి చెందిన విజయతో 2014 సంవత్సరంలో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు.

గంగదారి నరేష్ నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్ నందు సూర్య మోటర్స్ పేరుతో కార్ మెకానిక్ షాప్ నడిపిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో విజయ ప్రతి చిన్న విషయంలో నరేష్ తో గొడవకి దిగుతూ, ఇష్టం వచ్చినట్టు నరేష్ ని తిడుతుండేది. నరేష్ ని విజయ మానసికంగా వేదించడంతో నరేష్ మద్యానికి బానిస అయ్యాడు. బాగా  మద్యం సేవించడం వలన తన ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది. ఈ క్రమంలో బుధవారం  భార్య విజయ మానసిక వేదింపులు భరించలేక, మద్యానికి బానిస అయిన నరేష్ గడ్డి మందు తాగి నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ నందు చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడి తల్లి గంగా దారి లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.