11-08-2025 09:36:02 PM
తూప్రాన్ (విజయక్రాంతి): తూప్రాన్ పట్టణంలో బేడ బుడగ జంగాల కాలనీలో విభూది రవి అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్(CM Relief Fund) కోసం దరఖాస్తు చేసుకోగా 25 వేల రూపాయలు మంజూరు కాగా సోమవారం బాధితుడికి మున్సిపల్ 2వ వార్డ్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చింతల దశరథ చేతుల మీదుగా బాధిత కుటుంబానికి చెక్కును అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తుంది సీఎం సహాయనిది పేదలకు ఆదుకునే పిన్నిది లాగా ఉపయోగపడుతుందన్నారు. ఇందులో విభూది లక్ష్మి, చింతల హనుమంతు, అనరాసి ఆంజనేయులు, పత్తి శ్రీహరి, పత్తి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.