11-08-2025 09:04:36 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం(వీ)లో శ్మశాన వాటికకు సరైన దారి లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన గ్రామానికి చెందిన చిల్లం చర్ల శ్రీనివాస్ 19 వేల రూపాయలతో వెట్ మిక్స్ మెటీరియల్ తెప్పించి దారిని మెరుగుపరిచారు. దీనితో గ్రామస్తులు శ్రీనివాస్ ను అభినందనలతో ముంచెత్తారు.