11-10-2025 12:22:20 AM
కామారెడ్డి,(విజయక్రాంతి): ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాకు పిసిసి అబ్జర్వర్ గా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి నియమిస్తూ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డికి చెందిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాల్లో నూతన కమిటీల ఏర్పాటు చేసే బాధ్యతలను అప్పగించారు.
ఈ సందర్భంగా ఆయన కామారెడ్డిలో పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు తనకు అప్పగించిన పార్టీ పటిష్టతకు చేయాల్సిన కృషిని తప్పకుండా నెరవేరుస్తానని తెలిపారు. పార్టీ బలోపేతానికి అందరితో కలిసి పనిచేస్తానన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే విధంగా తన శాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు. తనకు బాధ్యతలను అప్పగించిన టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లకు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.