09-08-2025 10:50:30 PM
కమలాపూర్/హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరు గ్రామానికి చెందిన కలం(బూడిద) సురేందర్ గద్దర్ అవార్డు(Gaddar Award) అందుకున్నారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ వర్ధంతి కార్యక్రమాల్లో భాగంగా తెలంగాణ సాంస్కృతిక సారథి ప్రతినిధి గద్దర్ ప్రియ శిష్యుడు శనిగరం బాబ్జీ ఆధ్వర్యంలో హుజురాబాద్ లో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో కీలక పాత్ర పోషించిన బూడిద సురేందర్ కు గద్దర్ అవార్డును తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల చేతుల మీదుగా అందజేశారు. గద్దర్ అవార్డు అందుకున్న కలం సురేందర్ ను హనుమకొండ జిల్లా సాంసృతిక సారధి కళాకారులు, కమలాపూర్ ప్రగతి యువజన సంక్షేమ సంఘం, ప్రగతి స్వచ్చంధ సంస్థ సభ్యులు అభినందించారు.