09-08-2025 10:53:43 PM
ఎమ్మెల్యే పాయల్ శంకర్..
అదిలాబాద్ (విజయక్రాంతి): స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఆదివాసి సమస్యలు అలాగే ఉన్నాయని అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్(MLA Payal Shankar) అన్నారు. మానవ జాతికి మూల కారణం ఆదివాసులేనని అన్నారు. శనివారం ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ లోని రెవెన్యూ గార్డెన్ లో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆదివాసి సమాజానికి ప్రపంచ ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పాలకులు ఎందరు మారినా ఆదివాసీల బతుకుల్లో మాత్రం మార్పు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డి, తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ తో పాటు పలువురు ఆదివాసీ సంఘాల నేతలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.