09-08-2025 10:48:41 PM
కరీంనగర్ క్రైం (విజయక్రాంతి): స్వాతంత్య సంగ్రామంలో కీలక ఘట్టం క్విట్ ఇండియా ఉద్యమం అని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి(Suda Chairman Komatireddy Narender Reddy) అన్నారు. ఆనాడు రెండవ ప్రపంచ యుద్ధంలో భారతదేశాన్ని ఉపయోగించుకోవాలని బ్రిటన్ భావించిందని భారత దేశానికి స్వతంత్రం ఇస్తేనే యుద్ధానికి మద్దతు ఇవ్వాలని భారతీయులు భావించారని ఇందుకు బ్రిటన్ అంగీకరించలేదని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. భారతీయులను ఒప్పించి యుద్ధంలో దించుటకు సర్ స్రాఫర్డ్ క్రిప్స్ అనే మంత్రిని బ్రిటన్ భారత్ కు పంపించడం జరిగిందని గవర్నర్ జనరల్ కౌన్సిల్ లో రక్షణ సభ్యునిగా భారతీయుడ్ని నియమించాలనే భారత్ ప్రతిపాదనను బ్రిటన్ అంగీకరించక పోవడం వల్ల దౌత్యం విఫలమైందని 1942 ఆగష్టు 8న బొంబాయిలోని వార్దాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై బ్రిటిష్ పాలన అంతమవ్వాలని క్విట్ ఇండియా తీర్మానం ఆమోదించడం జరిగిందని నరేందర్ రెడ్డి అన్నారు.
ఆగష్టు 9న ఎన్నో నిర్బంధాల మధ్య క్విట్ ఇండియా ఉద్యమం విజయవంతం అయిందని కానీ ఎందరో ఉద్యమకారులు అమరులయ్యారని మరెందరినో జైళ్ళల్లో బంధింపబడ్డారని నరేందర్ రెడ్డి గుర్తు చేశారు.ఆనాటి స్వాతంత్ర్య ఉద్యమం మొత్తం గాంధీ,నెహ్రూ తో పాటు ఎందరో మహానుభావులు కాంగ్రెస్ జండా పట్టుకొని పోరాటం చేశారని అటువంటి కాంగ్రెస్ పార్టీ జండా మోయడాన్ని నిరంతరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా గర్వపడుతామని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఎండి తాజ్,గుండాటి శ్రీనివాస్ రెడ్డి,కుర్ర పోచయ్య,రవీందర్ గౌడ్,మేరాజ్,అష్రఫ్,సుదర్శన్,షబానా మహమ్మద్,ముల్కల కవిత,జ్యోతిరెడ్డి,మాసూమ్ ఖాన్,యనమల మంజుల,హసీనా,సాయిరాం,బషీర్,ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.