calender_icon.png 4 August, 2025 | 7:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నుల పండువగా గడిమైసమ్మ తల్లి బోనాలు

04-08-2025 12:18:03 AM

వేల సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు

మేడ్చల్ అర్బన్, ఆగస్ట్ 3:మేడ్చల్ పట్టణంలోని శ్రీ గడి మైసమ్మ తల్లి దే వాలయంలో శ్రావణ మాస బోనాలను అత్యంత భక్తి శ్రద్దల మధ్య ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం నిర్వహించు శ్రీ గడి మైసమ్మ తల్లి, శ్రీ కోటగ డ్డ మైసమ్మ తల్లి శ్రావణ మాస భవనాలను ఈ సంవత్సరం సైతం అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా నిర్వహించారు.

తెల్లవారుజామున అమ్మవారి అభిషేకం అనంతరం సహస్రనామాలతో కుంకుమా ర్చన, అమ్మవారి తొట్టెల ఊరేగింపు చేపట్టారు. మేడ్చల్ పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారిని దర్శించుకున్నా రు. ఇందుకోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కిలోమీటర్ మేరకు విద్యుత్ దీపాలను అలంకరించారు.

గడి మైసమ్మ తల్లి అమ్మవారిని  అలంకరించి భక్తులకు దర్శనం క ల్పించారు. తెల్లవారుజామున నుండే భక్తులు గడి మైసమ్మ దేవాలయం చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులతో గడి మైసమ్మ దేవాలయం కిటకిటలాడింది.

ఆకర్షనీయంగా పలహారం బండ్ల ఊరేగింపు :

శ్రావణమాస గడి మైసమ్మ తల్లి బోనాల పం డగ నేపథ్యంలో మేడ్చల్ పట్టణంలోని పలు కాలనీల నుంచి అమ్మవారి ఆదివారం సాయంకా లం ఆలయానికి పలహారం బండ్లు ఊరేగింపుగా తీసుకొచ్చి నైవేద్యాలను సమర్పించారు.

పలహారం బండ్ల ఊరేగింపులో పోతురాజుల ఆటలు, డప్పు చప్పులతో స్థానికులను ఆకట్టుకున్నాయి. మేడ్చల్ పట్టణమంతా బోనాల పండుగ వాతావరణం కనిపించింది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మేడ్చల్ పోలీసులు పకడ్బందీ బందోబస్తును నిర్వహించారు.