04-08-2025 06:34:22 PM
టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలం బోడు గ్రామపంచాయతీ లోక్యా తండా గ్రామంలో బేతంపూడి ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల నూతన సేల్ పాయింట్ ను పీఏసిఎస్ చైర్మన్ లక్కినేని సురేందర్ రావు(PACS Chairman Lakkineni Surender Rao) సోమవారం ప్రారంభించారు. బోడు రైతులు ఇక నుంచి టేకులపల్లి వెళ్లకుండా సమీపంలోనే సేల్ పాయింట్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పీఏసిఎస్ కార్యదర్శి పొన్నోజు ప్రేమాచారీ, ఆత్మ కమిటీ చైర్మన్ బోడ మంగీలాల్ నాయక్, మండల కాంగ్రెస్ నాయకులు ఈది గణేష్, వసంత్, భూక్య సైదులు నాయక్, బాలాజీ రావు నాయక్, బాలు, రవి, శ్రీనివాస్, బాస్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.