calender_icon.png 4 August, 2025 | 9:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్ల బెల్లం, పటిక పట్టివేత

04-08-2025 06:31:55 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District)లోని వివిధ ప్రాంతాలకు నాటు సారా తయారీ కోసం ఇతర ప్రాంతాల నుంచి బొలెరో, మోటార్ సైకిల్ పై అక్రమంగా తరలిస్తున్న 8 క్వింటాల పటిక, 150 కిలోల నల్ల బెల్లం, 20 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు గూడూరు ఎక్సైజ్ సీఐ బిక్షపతి తెలిపారు. కేసముద్రం మండలం అర్పణ పల్లి వద్ద రూట్ వాచ్ నిర్వహిస్తుండగా మీరు పట్టుబడ్డట్లు చెప్పారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ రాజేశ్వరి, హెడ్ కానిస్టేబుల్ బుచ్చయ్య, సుధాకర్, నరేష్, బాలకృష్ణ, నందకిషోర్, గద్దర్, సాయిరాం, అభిలాష్, యుగంధర్ పాల్గొన్నారు.