04-08-2025 12:16:16 AM
ఘట్ కేసర్, ఆగస్టు 3 : ఉమ్మడి ఘట్ కేసర్ మండలంలోని ఘట్ కేసర్, ఘనాపూ ర్, అంకుశాపూర్, వెంకటాపుర్ ఇస్మాయిల్ ఖాన్ గూడ లోని ప్రజలు ఆదివారం బో నాల పండగను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వర కు మహిళలు నైవేధ్యంతో కూడిన బోనాల తో శివసత్తుల పూనకాలతో వెంటరాగా కు టుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలసి అ మ్మవారి ఆలయాలకు చేరుకుని సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
ప్రజలు పెద్ద సంఖ్యలో అమ్మవారి ఆలయాలకు చేరుకోవడంతో భక్తజనులతో ఆలయ ప్రాంగణాలు కిటకిటలాడాయి. వెంకటాపూర్ లో జరిగిన బోనాల ఉత్సవంలో మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొనగా ఘట్ కేసర్ లో మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్యయాదవ్, మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరియాదవ్,
బీబ్లాక్ కాంగ్రె స్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ కుటుం బ సభ్యులతో కలిసి పాల్గొని ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. సా యంత్రం యువకులు తీసిన తొట్టెల, పలహారపుబండి ఊరేగింపులు ప్రజలను ఎంతగా నో ఆకట్టుకున్నాయి.
ఊరేగింపు ఉత్సవాన్ని తిలకించడానికి ప్రజలు అధిక సంఖ్యలో వి చ్చేసి అమ్మవారికి పూజలు జరిపారు. బ్యాం డువాయిధ్యాలతో సాగిన ఫలారపుబండి ఊరేగింపులో యువకులు చేసిన నృత్యాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మాజీ కౌన్సిలర్లు ఆయా రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.