గద్వాల చీరల ప్రత్యేకతను చాటుతూ విధులు
14-05-2024 01:45 AM
వనపర్తి (గద్వాల), మే 13 (విజయక్రాంతి): గద్వాల చేనేత జరీ చీరలు అనగానే మగువలు ఎంతో మక్కువ చూపుతారు. ఆ చీరల ప్రత్యేకతను చాటుతూ జోగుళాంబ గద్వాల జిల్లాలో మహిళా సిబ్బంది సోమవారం ఎన్నికల విధులు నిర్వహించారు. స్వీప్ కార్యక్రమం లో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సంతోష్ 8 మంది మహిళా సిబ్బంది కోసం ప్రత్యేకంగా నేయించిన గద్వాల చీరలను అందజేశారు. జమ్మిచేడు గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో నలుగురు, అలంపూర్‌లోని మహిళా పోలింగ్ కేంద్రంలో నలుగురు మహిళా సిబ్బంది చేనేత జరీ చీరలను ధరించారు. ఈ చీరల కొంగుపై ‘హెచ్‌ఓపీ ఎలక్షన్స్ 2024 జోగుళాంబ గద్వాల జిల్లా’ అని ఆంగ్ల భాషలో ముద్రించడం విశేషం.




