26-07-2025 09:53:27 PM
తరిగొప్పుల,(విజయక్రాంతి): రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు విక్రయించాలని ఎస్సై ఫర్టిలైజర్స్ యజమానులకు సూచించారు. మండల కేంద్రంలో ఫర్టిలైజర్ షాపుల్లో ఆకస్మిక తనిఖీ చేపట్టారు.నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనంతరం ఈ తనిఖీలో భాగంగా స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్స్, మరియు ఇతర రికార్డ్స్ పరిశీలించారు. నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే స్థానిక పోలీస్ స్టేషన్లో లేదా వ్యవసాయ అధికారి కార్యాలయంలో సమాచారం అందించాలన్నారు. సమాచారం తెలియజేసిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. అదేవిధంగా రైతులకు యూరియా, డి ఏ పి అందుబాటులో ఉంచాలన్నారు.