calender_icon.png 27 July, 2025 | 8:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏజెన్సీలో విష జ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి

26-07-2025 10:05:04 PM

సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ నేత జగన్ సింగ్

అదిలాబాద్,(విజయక్రాంతి) : వర్షాకాలం నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో విష జ్వరాలు ప్రబలకుండా హెల్త్ క్యాంపులు నిర్వహించాలని CPI (ML) మాస్ లైన్ (ప్రజాపంథా) ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జగన్ సింగ్ అన్నారు. శనివారం అదిలాబాద్ రూరల్ మండలం ఆర్లి (బి) గ్రామ పంచాయతీ శివారులో నివసిస్తున్న నిశాన్ఘాట్ గ్రామాన్ని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి మడవి రేణుక తదితరులతో కలిసి ఆయాన సందర్శించారు.

ఈ సందర్భంగా జగన్ సింగ్ మాట్లాడుతూ  విష జ్వరాలతో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నందున ప్రభుత్వ వైద్యాధికారులు తక్షణమే గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని కోరారు. అదేవిధంగా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారులు, గ్రామ కార్యదర్శిలు పారిశుద్ధ పనులను ఎప్పటికప్పుడు చేపట్టి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆయన కోరారు. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో విష జ్వరాలను బారిన పడి అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.