calender_icon.png 27 July, 2025 | 8:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోర్టు హాళ్లను ప్రారంభించిన న్యాయమూర్తులు

26-07-2025 09:45:57 PM

మేడ్చల్ అర్బన్: మేడ్చల్ పట్టణంలోనీ శేషన్, సివిల్ కోర్టు ఆవరణలో నిర్మించినటువంటి నూతన కోర్టు హళ్ల ప్రారంభోత్సవానికి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు ఆనంద్ కుమార్ శివాలి, బి.విజయ్ సేన్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. శనివారం నూతనంగా నిర్మించినటువంటి కోర్టు హాళ్లలో పలు విభాగాలకు చెందినటువంటి న్యాయమూర్తుల కార్యకలాపాలు కొనసాగుతాయని బార అసోసియేషన్ అధ్యక్షుడు చీదు హనుమంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికిముఖ్య అతిథులుగా హాజరైన న్యాయమూర్తులను బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చీదు హనుమంత్ రెడ్డి శాలువాతో ఘనంగా సత్కరించారు.