26-07-2025 10:08:04 PM
గోదావరి నది వరద ప్రవాహం పెరిగింది
ఎస్సై ఇనిగాల వెంకటేష్
కన్నాయిగూడెం,(విజయక్రాంతి): వర్షాకాలం అయినందున గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కన్నాయిగూడెం ఎస్సై ఇనిగాల వెంకటేష్ శనివారం సూచించారు ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ గోదావరి నది వద్ద వరద ప్రవాహం అధికంగా ఉంది తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజీ వద్దకి ఎవరు సెల్ఫీలకు,చాపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ప్రజలు అవసరం అయితే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని,రైతులు పొలాల దగ్గరకి వెళ్ళినప్పుడు కరెంట్ వైర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. భారీ వర్షాలు కురుస్తుoదున విద్యుత్ స్తంభాలు, వైర్లకు తాకకుండా తగు జాగ్రత్తలు ప్రజలు తీసుకోవాలని అన్నారు.
భారీ వర్షాల వల్ల ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు,వంకలు,చెరువులు వర్షం నీటి వల్ల రోడ్డుపై వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉన్నందున,పరిమిత వేగంతో వాహనాలు నడపాలని అన్నారు పిల్లలు,యువకులు చెరువులు వాగులు దగ్గరకు సెల్ఫీలు తీసుకోవడానికి,ఈత కొట్టడానికి వెళ్లకుండా తల్లిదండ్రులు దృష్టి సారించాలన్నారు అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం డయల్ 100కు కాల్ చేయాలని స్పష్టం చేశారు వర్షాల నేపథ్యంలో ప్రజలు వాగులు, వంతెనలను దాటడం మానుకోవాలని ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యమని అన్నారు ఈ భారీ వర్షాలకు లోతట్టు ప్రాంత ప్రజలు అధికారుల సూచనలను పాటించాలని,సురక్షితంగా ఉండాలని,అధికారులు,పోలిస్ శాఖ అప్రమత్తంగా ఉందని తెలిపారు