26-07-2025 10:01:56 PM
ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రత్యేకాధికారి అనితా రామచంద్రన్
సూర్యాపేట,(విజయక్రాంతి): ఎమ్మార్పీ కే రైతులకు ఎరువులను విక్రయించాలని, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రత్యేక అధికారి అనిత రామచంద్రన్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి సూర్యాపేటలోని మార్కెట్ లోని రుక్మధార్ ఎరువుల దుకాణంను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆమె ఈ పాస్ మిషన్ ద్వారా నిల్వలు పరిశీలించారు. రైతులు ఏ రకం విత్తనాలు కొనుగోలు చేశారని యజమానిని అడగగా సన్నరకం ఎక్కువ కొనుగోలు చేసారని తెలిపారు. షాప్ లో ఉన్న యూరియా, డి ఎ పి నిలువలు పరిశీలించి రైతులకు కావాల్సిన ఎరువులు ఉన్నాయని ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. తదుపరి అక్కడే ఉన్న ఎండ్లపల్లి గ్రామానికి చెందిన బాను అను రైతుని ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఏ పంట వేశారు, ఎకరానికి ఎంత యూరియా వాడతారని ఆరా తీశారు. వీరి వెంట జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి సందీప్, పలువురు అధికారులు ఉన్నారు.