26-07-2025 09:59:02 PM
మేడిపల్లి: పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు రెయిన్ కిట్లు, పిపిఈ కిట్లు పంపిణీ చేసిన పీర్జాదిగూడ కమిషనర్ త్రిలేశ్వర్ రావు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ... పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, వర్షంలో పని చేస్తున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని, సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నందున పలు సూచనలు చేశారు. నగర శుభ్రతకు పాటుపడుతున్న కార్మికుల సేవలు వెలకట్టలేనివని, వారి ఆరోగ్యం కోసం ప్రతి శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో వైద్య శిబిరాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.