calender_icon.png 30 July, 2025 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏపీ, తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ గా మోరంపూడి అనిల్ కుమార్

29-07-2025 05:25:22 PM

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ గా మోరంపూడి అనిల్ కుమార్ ఎన్నికయ్యారు. ఇటీవల ఐటీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ గా బదిలీపై వచ్చిన అనిల్ కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. 1990 బ్యాచ్ కు చెందిన ఐఆర్ఎన్ అధికారి మోరంపూడి అనిల్ కుమార్ వివిధ రాష్ట్రాల్లో పలు హోదాల్లో పని చేశారు. విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, బెంగళూరు, ముంబయిలో పని చేసిన  అనిల్ కుమార్ కేరళ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్ కంటాక్స్ హోదాలో కూడా విధలు నిర్వహించారు. కేరళ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ గా పదోన్నతి పొందారు. 9 ఏళ్ల తర్వాత ఐటీ శాఖ చీఫ్ కమిషనర్ గా తెలుగు వ్యక్తి మోరంపూడి అనిల్ కుమార్ నియామకమయ్యారు. ఏలూరు జిల్లా లింగపాలెంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన అనిల్ కుమార్ కుటుంబం విజయవాడలో స్థిరపడింది.