calender_icon.png 5 August, 2025 | 7:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానసిక ఉల్లాసానికి ఆటలు అవసరం

05-08-2025 12:00:00 AM

జిల్లా జడ్జి వీరయ్య

మంచిర్యాల, ఆగస్టు 4 (విజయక్రాంతి): న్యాయవాదులు కేసుల బిజీలో మానసికం గా ఒత్తిడికి గురవుతుంటారని, ఆటల పోటీలతో శారీరక, మానసిక ఉల్లాసాన్ని పొందు తారని జిల్లా జడ్జి వీరయ్య అన్నారు. స్వాతం త్ర దినోత్సవాన్ని పురష్కరించుకొని జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమ వారం బార్ హాలులో నిర్వహించిన ఆటల పోటీలను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ క్రీడలలో గెలుపు ఓటములు సహజమని, గెలుపు ఓటములకు అతీతంగా అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్జిలు శ్రీనివా సనాయక్, రామ్మోహన్, నిర్మల, కవిత, బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ భుజంగరావు,

జనరల్ సెక్రెటరీ మురళి కృష్ణ, స్పోరట్స్ సెక్రటరీ రంగు వేణు కుమార్, లైబ్రరీ సెక్రెటరీ రంజిత్ గౌడ్, అడ్వకేట్స్ ఆకుల రవీందర్, కోట మల్లయ్య, గడ్డం శ్రీనివాస్, చిట్ల రమేష్, ఎం రవీందర్రావు, సురేం ద్ర ఉపాధ్యాయ, దొడ్డి తిరుపతి, వేలుముల సతీష్, రమణారెడ్డి, కిన్నర శ్రీను, తులా ఆంజనేయులు, భీమ రంజిత్, శేఖర్, ఉప్పరి సాగర్ తదితరులు పాల్గొన్నారు.