05-08-2025 12:00:00 AM
కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆగస్టు ౪ (విజయక్రాంతి): ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జనకాపూర్ ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రా న్ని ఆకస్మికంగా సందర్శించి రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్య ఉప కేంద్రం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, గ్రామాలలో సందర్శిం చి జ్వర పీడితులను గుర్తించి వారికి అవసరమైన వైద్య చికిత్సలు అందించాలని తెలి పారు. ప్రతి మంగళవారం, శుక్రవారం గ్రామాలలో ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ వర్కర్లు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేసి డ్రైడే - ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలిపారు.
మండలంలోని బూర్గుడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తు న్న మధ్యాహ్న భోజనం నాణ్యత, మెనూ, తరగతి గదులు పరిశీలించారు. విద్యారంగ బలోపేతం దిశగా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం పోషక విలువలు కలిగిన ఆహారం, సిద్ధమైన త్రాగునీటిని అందించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.
విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి పఠన సామర్థ్యాలను తెలుసుకున్నారు. విద్యార్థుల కు అర్థమయ్యేలా పాఠాలను బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యా ర్థులు పాల్గొన్నారు.