ఐక్య ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారం
- ఏఐఎస్‌జీ పీఎఫ్ అధ్యక్షులు సురేంద్ర చౌదరి
- ఏఐఎస్‌జీ పీఎఫ్ ప్రధాన కార్యదర్శి వజీర్ సింగ్
ముషీరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ (ఏఐఎస్ జిపిఎఫ్) జాతీయ కౌన్సిల్ సమావేశాలు సుదరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్ లో సురేంద్ర చౌదరి అధ్యక్షతన జరిగాయి. ఈ సమావేశాలకు టప్రప ఆధ్వర్యంలో దేశంలోని 15 రాష్ట్రాల నుండి 72 మంది ప్రతినిధులు హాజరై దేశంలోని వివిధ రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలపై సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో తీర్మానాలను సురేంద్ర చౌదరి వివరిస్తూ 30-35 సంవత్సరాల సర్వీసు చేసి రిటైర్ అయిన పెన్షనర్లకు గౌరవ ప్రదమైన జీవితాన్ని గడిపే పరిస్థితి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అన్నారు. అందుకోసం వాలిడేషన్ ఆక్ట్ లాంటి చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. ప్రధాన కార్యదర్శి వజీర్ సింగ్ మాట్లాడుతూ కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్ రికవరీని 15 సం నుండి 11 సంవత్సరాలకు తగ్గించాలని, వైద్య సౌకర్యాలను కల్పించాలని కోరారు.
ఎక్జి క్యూటివ్ సమావేశం తరువాత ఓపెన్ సేషన్ లో తీసుకున్న నిర్ణయాలను వివరించారు. ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీకుమార్ ముఖ్య అతిథిగా హాజరై పెన్షనర్లకు ఇస్తున్న సౌకర్యాలు ఏవో ప్రభుత్వం ఔదార్యంతో ఇస్తున్నవి కావని, అవి వారి హక్కు అన్నారు. కోవిడ్ కాలంలో రద్దు చేసిన రైల్వే ప్రయాణ రాయితీని పునరుద్ధరించాలని కోరారు. ఉపాధ్యక్షులు క్రిష్ణమూర్తి మాట్లాడుతూ సిపియస్ రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు.
ఈ సదస్సులో టాప్ర గౌరవ అధ్యక్షుడు ఎంఎన్ రెడ్డి, అధ్యక్షులు నారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి క్రిష్ణమూర్తి, కోశాధికారి అశోక్, ఆహ్వాన సంఘం అధ్యక్షులు డా. అరుణ, స్వరాజ్ కుమార్, కొండల రావు, యు. అంజనేయులు, నరహరి, జనార్థన్ రెడ్డి, రామచంద్రుడు, వైకుంఠ రావు, క్రిష్ణమోహన్, లక్ష్మినారాయణ కమల కుమారి క్రిష్ణారావు, నాగేశ్వర్ రావు, తదితరులు పాల్గొన్నారు.






