05-09-2025 12:53:42 AM
-కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, సెప్టెంబర్ 4 (విజయక్రాం తి): జిల్లాలో వినాయక నిమజ్జన ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. గురు వారం మంచిర్యాల పట్టణంలో వినాయక నిమజ్జన శోభ యాత్ర నిర్వహించే రూట్ మాప్, ఇతర ఏర్పాట్లను రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా, డీసీపీ ఎగ్గడి భాస్కర్, ఏసీపీ ప్రకాష్ లతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్, సీపీలు మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గణేష్ శోభాయా త్ర కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సంబంధిత శాఖల సమన్వయంతో రూట్ మ్యాప్ రూపొందించడం జరి గిందన్నారు. నిమజ్జన ప్రదేశాలలో విద్యుత్, మత్స్యశాఖ, పోలీస్, రెవెన్యూ సంబంధిత శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశామన్నారు.
భద్రత దృష్ట్యా పోలీసు బందోబస్తు, నిమజ్జన ప్రదేశాలలో క్రేన్, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచామన్నారు. అంతకుముందు తాండూరు పెద్ద చెరువు వద్ద ఏర్పా ట్లను పరిశీలించారు. వీరి వెంట హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు డాక్టర్ చుంచు రాజ్ కిరణ్, ప్రధాన కార్యదర్శి రవీందర్, కృష్ణ, సీఐలు, ఎస్సైలు సిబ్బంది ఉన్నారు.
ఏసీపీలు ప్రత్యేక పూజలు
పండుగలు శాంతియుత వాతావరణం లో జరుపుకోవాలనీ మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని వంద ఫీట్ల రోడ్డులో అంజనీ పుత్ర రియల్ ఎస్టేట్స్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అను గుణంగా పండుగలు ఆధ్యాత్మికంగా, శాంతి యుత మార్గంలో నిర్వహించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో అంజనీ పుత్ర సంస్థ చైర్మెన్ గుర్రాల శ్రీధర్, మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి, అంజనీ పుత్ర సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌లు సూరినేని కిషన్, కాసర్ల సదానందం డైరెక్టర్‌లు, స్థానిక సీఐ, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.
సమన్వయం వ్యవహరించాలి: ఎస్పీ
భైంసా సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): భైం సాలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర శాంతియుతంగా, సురక్షితంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేశామని పోలీసులు ఓర్పు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. తెలిపారు. భైంసాలో గురువారం గణేష్ నిమజ్జన శోభాయాత్ర సం దర్భంగా పోలీసులతో ఏర్పాటు చేసిన సమావేశంలో దిషానిర్దేశం చేశారు.
శోభయాత్రను శాంతియుతంగా నిర్వహించేందుకు పట్టణంలో బందోబస్తుకు 600 మంది పోలీసు లు అధికారులను, 120 సిసి కెమెరాలను,4 డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఈ కెమెరాలు అన్ని కూడా హైదరాబాద్‌లో ఉన్న కమాండ్ కంట్రోల్‌కి అనుసంధానం చేశామ ని తెలియజేశారు. గణేష్ శోభాయాత్రలో పాల్గొనే భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ రూట్ మ్యాప్ ప్రకారం శోభాయాత్ర సాఫీగా కొనసాగే విధంగా చూడాలన్నారు.
శోభాయా త్ర మార్గాల్లో ఎలాంటి అవాంతరాలు లేకుం డా బారికేడింగ్, ట్రాఫిక్ డైవర్షన్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భైంసా పట్టణం లో ముఖ్య రహదారులపై ట్రాఫిక్ డైవర్షన్లు అమలు చేస్తూ, ప్రత్యేక పోలీసు బృందాలను నియమించినట్లు పేర్కొన్నారు.శాంతి భద్రతల భంగం కలిగించే ఎటువంటి సంఘట నలు జరగకుండా సమన్వయంతో, ఓపికతో పనిచేయాలని సూచించారు.గణేష్ శోభాయాత్ర రూట్ను పరిశీలించి, అవసరమైన సూచనలు ఇచ్చారు.
ముఖ్యంగా జనసంచా రం ఎక్కువగా ఉండే ప్రదేశాలు, నిమజ్జన ఘాట్లు, ట్రాఫిక్ జంక్షన్ల వద్ద అదనపు బందోబస్తు అమలు చేయాలని ఆదేశించారు. బందోబస్తు విధులు నిర్వహించుటకు మేము, మా సిబ్బంది, సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి,భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఐపీఎస్, ఇన్స్పెక్టర్లు, ఎస్‌ఐ లు,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్
బెల్లంపల్లి, సెప్టెంబర్ 4 : బెల్లంపల్లి పట్టణంలో వినాయక నిమజ్జనాన్ని పురస్కరిం చుకొని గురువారం స్థానిక పోచమ్మ చెరువు వద్ద మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టారు. ఎర్ర చెరువు ప్రాంతంలో మట్టిని పోసి రోడ్డు చదును చేశారు.
బెల్లంపల్లి రూరల్ సీఐ హనూక్, తాళ్లగురిజాల ఎస్సై రామకృష్ణ నిమజ్జన ఏర్పా ట్లను పరిశీలించారు. గణేష్ మండళ్ల నిర్వాహకులు నిమజ్జనం సమయంలో పోలీసులకు సహకరించాలని సీఐ హనూక్ కోరారు. ఎక్క డ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గట్టి బందోబస్తు నిర్వహించనున్నట్లు చెప్పారు.