05-09-2025 12:52:15 AM
-ఉపాధ్యాయ దినోత్సవంలో కలెక్టర్ రాజర్షి షా
-తల్లిదండ్రుల తర్వాత గురువులకే ప్రాధాన్యత: ఎమ్మెల్యే పాయల్ శంకర్
అదిలాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాం తి): ఉపాధ్యాయ దినోత్సవంను జిల్లాలో ఒకరోజు ముందుగానే నిర్వహించారు. సెప్టెంబర్ 5న నిర్వహించే డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి పురస్కరించుకుని గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉపాధ్యాయ దినోత్సవ గురుపూజో త్సవం, ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్స వం కార్యక్రమం ఘనంగా చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఇంచార్జ్ జిల్లా విద్యా శాఖాధికారి ఖుష్బూ గుప్తా పాల్గొన్నారు. ముందుగా డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్ర పటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లాలోని ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి వారికి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేసి సన్మానించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును రూపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం అన్నారు. ఉపాధ్యాయుల అంకితభావం, నిస్వార్థ కృషిని గుర్తించి, వారిని గౌరవించడమే ఈ టీచర్స్ డే ఉద్దేశమన్నారు.
ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే ఉపాధ్యాయులుగా వస్తారని, ఉపాద్యాయ దినో త్సవానికి ఉన్న ప్రాముఖ్యత మరేదానితో పోల్చడానికి లేదన్నారు. సమాజంలో తల్లిదండ్రుల తర్వాత గురువులకే ప్రాధాన్యత ఉంటుందన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజరెడ్డి, ట్రైనీ కలెక్టర్ సలోని, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.