07-09-2025 06:26:35 PM
నిర్మల్ (విజయక్రాంతి): ఈరోజు సమగ్ర శిక్ష, ఆలింకో ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ ద్వారా నిర్వహించబడిన 0 నుంచి 18 సంవత్సరాల వయసు గల దివ్యాంగ విద్యార్థుల ఉపకరణాల గుర్తింపు, నిర్ధారణ శిబిరం విజయవంతంగా అయిందని జిల్లా విలీన విద్య సమన్వయకర్త శ్రీ ఎన్ ప్రవీణ్ కుమార్(District Integrated Education Coordinator Praveen Kumar) తెలిపారు. ఈరోజు నిర్మల్ డివిజన్లోని 12 మండలాల పరిధిలోని 0 నుండి 18 సంవత్సరాల వయసు గల దివ్యాంగ విద్యార్థులకు అవసరమయ్యే ఉపకరణాల గుర్తింపు, నిర్ధారణ శిబిరం నిర్వహించడం జరిగిందని, ఈ శిబిరానికి జిల్లాలోని నిర్మల్ డివిజన్ పరిధిలోని 12 మండలాల నుంచి సుమారు 120 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారని, వీరిలో ఉపకరణాలు అవసరము గల విద్యార్థులను ఆలింకో నుండి వచ్చిన సాంకేతిక నిపుణులు గుర్తించడం జరిగిందని ఆయన తెలిపారు. వీరికి త్వరలోనే ఉపకరణాలు వస్తాయని, వచ్చిన వెంటనే అందజేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలింకో ప్రతినిధి రాజా బాబు, విలీన విద్య రిసోర్స్ ఉపాధ్యాయులు, ప్రత్యేక ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.