calender_icon.png 8 September, 2025 | 12:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవభారత నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం

07-09-2025 08:59:16 PM

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి     

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): నవభారత నిర్మాణానికి ఉపాధ్యాయుల పాత్ర కీలకం అని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy) అన్నారు. ఆదివారం రోజున నగరంలోని శ్రీ రాఘవేంద్ర మినీ ఫంక్షన్ హాల్లో జరిగిన ప్రైవేట్ ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ, సగటు ఉపాధ్యాయుడికి గౌరవం ఇవ్వడం అంటే మన రాబోయే తరానికి సన్మానం చేసినట్టే అన్నారు. ప్రైవేట్ టీచర్లకు చాలా సమస్యలు ఉన్నాయని నా దృష్టికి వచ్చిందన్నారు. రాబోవు రోజుల్లో తప్ప ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు. విద్యాబోధన అందిస్తూ పేదరికంలో ఉన్న ఉపాధ్యాయులకు తప్పకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో లబ్ధి చేకూరేలా చూస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కూర వెంకట్, ముజీబ్ ,కమిటీ సభ్యులు డోలి రాజు,అస్మా బేగం ,అనిశెట్టి నరేష్ తదితరులు పాల్గొన్నారు.