06-09-2025 12:39:23 AM
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
17మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
హాజరైన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ 5 (విజయక్రాంతి) డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జి ల్లా సమీకృత కార్యాలయంలోని ఆడిటోరియంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో పాటు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సర్వేపల్లి రా ధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భం గా ప్రభుత్వ విప్ మాట్లాడారు అంకితభావంతో విధులు నిర్వహించే ఉపాధ్యాయు లకు తప్పకుండా గుర్తింపు వస్తుందన్నారు. విద్యారంగ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి నే తృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తుందని తెలిపా రు. ఇందులో భాగంగా 11వేల టీచర్ పోస్టు లు భర్తీ చేసిందని, ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించిందని, బదిలీలకు అవకా శం కల్పించిందని వివరించారు.
ఉపాధ్యాయ హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. అన్ని పాఠశాలల్లో వసతులు కల్పించేందుకు నిధులు మంజూ రు చేస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో రూ. 200 కోట్లతో 25 ఎకరాల విస్తీర్ణంలో అన్ని వర్గాల విద్యార్థుల కు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందని వెల్లడించారు.
మారుతున్న కా లానికి అణుగుణంగా ఉపాధ్యాయులు కూ డా సాంకేతిక, నైపుణ్యతను అందిపుచ్చుకోవాలని, విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచిం చారు. తల్లిదండ్రులు జన్మనిస్తే ఉపాధ్యాయు లు విద్యార్థులను ఉన్నత స్థానాలకు ఎదిగేలా కృషి చేస్తారని వివరించారు. రాష్ట్రంలో జిల్లాను విద్యారంగంలో ఉన్న స్థానంలో నిలిపేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఉపాధ్యాయులకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం ఉపాధ్యాయు లు అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.జిల్లాలోని టీచర్లు జాతీయ, రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక అవ్వాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకాంక్షించారు.ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్ష లు తెలియజేశారు.
సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని ప్రభుత్వం నిర్వహిస్తుందని గుర్తు చేశారు. రాధాకృష్ణన్ తనకు వచ్చే జీతంలో 75 శాతం పేద బడుగు బలహీన వర్గాలకు అందజేసేవారన్నారు. బ్రిటిష్ ఇండియా లో నైట్ హుడ్ అవార్డు స్వీకరించారని గుర్తు చేశారు.రాధాకృష్ణన్ భారత ఉపరాష్ట్రపతిగా సేవలందించారని గుర్తు చేశారు.ఆయన సేవా గుణం, ఉపాధ్యాయ వృత్తిలో అందించిన విలువైన సేవలు ఆయనను ఇప్పటికీ నిలిచిపోయేలా చేశాయని పేర్కొన్నారు.
తన ది మద్రాస్ రాష్ట్రమైన కూడా కలకత్తా ఇతర ప్రాంతాల్లో సేవలందించారని తెలిపారు. ఉపాధ్యాయులకు బదిలీలు సహజమని గుర్తు చేశారు. ఉపాధ్యాయులు తాము బోధిస్తున్న పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెం చేలా కృషి చేయాలని, విద్యార్థులకు సులభమైన రీతిలో పాఠాలు బోధించాలని తెలిపారు. విలువలు, క్రమశిక్షణ పాటిస్తూ విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
పదో తరగతి ఫలితాల్లో మన జిల్లా రాష్ట్రస్థాయిలోఐదో స్థానంలో నిలిచిందని, జిల్లా ప్రథమ స్థానంలో నిలిచేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఉపాధ్యాయులందరూ అంకితభావంతో సేవలందిం చాలని సూచించారు. ప్రభుత్వ విద్యా సంస్థలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు నమ్మకం కలిగించేలా బోధించాలని, విద్యార్థులను తీర్చిదిద్దాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు
చకినాల శ్రీనివాస్, గుర్రం కృష్ణారెడ్డి, కైరి పద్మ, సీహెచ్ సత్తయ్య, గోలి రాధాకిషన్, అరుకాల బాల్ రెడ్డి, బోగారపు నవీన్, కట్ట రవీందర్, గోవులకొండ శ్రీనివాస్, ఎన్ దేవేందర్, నరహరి నాగమణి, జంగిటి రాజు, పీచు సుభాష్ రెడ్డి, గుండమనేని మహేందర్ రావు, దిడిగం స్రవంతి, బద్దం రవీందర్ ఓరుగంటి పద్మకళకు అవార్డులు అందజేసి, సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల, వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్లు స్వరూపారెడ్డి, రాజు, డీఈవో వినోద్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు.