calender_icon.png 31 August, 2025 | 9:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా వినాయకుని కళ్యాణోత్సవం

31-08-2025 05:17:29 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని లక్ష్మీ బాలాజీ నగర్ లో గణేష్ మండపం వద్ద ఆదివారం సిద్ధిబుద్ధి సమేత వినాయకుని కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వరుడి తరపున నూతి కట్ల మార్కండేయులు దంపతులు, వధువు తరపున సిరిపురం గంగాధర్ దంపతులు ఒకరినొకరు ఎదుర్కొని సాంప్రదాయ పద్ధతిన కార్యక్రమాన్ని వార్డులో నిర్వహించి సిద్ది బుద్ధి సమేత వినాయక విగ్రహాలతో ఊరేగింపు నిర్వహిస్తూ కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. వేద బ్రాహ్మణ మంత్రోచ్ఛారణల మధ్య సిద్ధిబుద్ధి సమేత వినాయకుని కళ్యాణాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. అనంతరం అన్నదానం జరిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ బాలాజీ నగర్ వాసులు పెద్ద ఎత్తున కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు.