31-08-2025 08:54:21 PM
పటాన్ చెరు/జిన్నారం,(విజయక్రాంతి): జిన్నారం పట్టణంలో ప్రతిభ విద్యానికేతన్ హైస్కూల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రిన్సిపల్ సార శ్రీనివాస్ నేతృత్వంలో గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని విద్యార్థులు అధ్యాపక బృందం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో గణపయ్యకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సార శ్రీనివాస్ మాట్లాడుతూ పండుగలు భారతీయ సంస్కృతి చరిత్ర వారసత్వానికి ప్రతిబింబాలన్నారు. గణపతి బప్పా మోరియా అగిలే బరస్ కు జల్దీ ఆవో అంటూ గణపతి నిమజ్జోత్సవం కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.