31-08-2025 08:09:35 PM
చిట్యాల(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ముదిరాజ్ లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మారబోయిన ధనుంజయ అన్నారు.ఆదివారం ధనుంజయ ప్రెస్ నోట్ ద్వారా తెలుపుతూ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ముదిరాజులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం చేస్తుందని అన్నారు.
అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులకు ప్రభుత్వం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఇస్తామన్న స్థానాలను కేటాయించాలని డిమాండ్ చేశారు. జడ్పీ చైర్మన్ స్థానాలు ఎంపీపీ జడ్పిటిసి ఎంపిటిసి మున్సిపల్ నగర పంచాయతీ మేయర్ స్థానాలను కేటాయించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని. ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పిట్టల కేశవులు వర్కింగ్ ప్రెసిడెంట్ దార్ల ఆనంద్ తదితరులు ఉన్నారు