calender_icon.png 1 September, 2025 | 1:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయ సేవలు మరువలేనివి

31-08-2025 08:24:22 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల భాషాభివృద్ధికి, విశేషమైన కృషి చేసిన ఆంగ్లభాష ఉపాధ్యాయులు ఆంగ్ల భాష టీచర్స్ అసోసియేషన్ ఎల్టా కడార్ల రవీంద్ర సేవలు చిరస్మరణీయమని జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు అన్నారు. ఆదివారం దిలావర్పూర్ మండలం బన్సపల్లి ఉన్నత పాఠశాల ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ కడార్ల రవీంద్ర పదవి విరమణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆంగ్ల భాష ఉపాధ్యాయులకు రవీంద్ర రోల్ మోడల్ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నేతలు ఉపాధ్యాయులు, మిత్రులు, బంధువులు పెద్ద ఎత్తున సన్మానించారు. ఆంగ్ల భాష టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.