calender_icon.png 1 September, 2025 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సేవాదళ్ ఆధ్వర్యంలో జాతీయ పతాకం ఆవిష్కరణ

31-08-2025 08:16:16 PM

మందమర్రి,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అనుబంధ సేవాదళ్ ఆధ్వర్యంలో పట్టణంలోని  పాత బస్టాండ్ ప్రాంతంలో ఆదివారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సేవాదళ్ జిల్లా అధ్యక్షులు హఫీజ్ ఉర్ రెహమాన్ మాట్లాడారు. జాతీయత భావాన్ని పెంపొందించేందుకు చేస్తున్న కృషిలో భాగంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించామ న్నారు. కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి ఉండేందుకు ఈ పతాక ఆవిష్కరణ దోహదపడు తుందన్నారు. ప్రతినెల చివరి ఆదివారం జాతీయ పతాక ఆవిష్కరించడం జరుగు తుందన్నారు.