31-08-2025 05:14:14 PM
బీజేవైఎం రాష్ట్ర నాయకులు సంకినేని వరుణ్ రావు
తుంగతుర్తి,(విజయక్రాంతి): గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని బీజేవైఎం రాష్ట్ర నాయకులు సంకినేని వరుణ్ రావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని శారద నగర్ లో ఏర్పాటు చేసిన గణేశుడి విగ్రహం వద్ద పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పదని, ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలన్నారు.